This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

ప్రెగ్నెన్సీలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్: లక్షణాలు మరియు జాగ్రత్తలు

Pregnancy
Written by - Swetha Raoచివరిగా నవీకరించబడింది: Feb 11, 2026
ప్రెగ్నెన్సీలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్: లక్షణాలు మరియు జాగ్రత్తలు
Likes20 Likes|
Read time11 min

ప్రెగ్నెన్సీలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్: లక్షణాలు మరియు జాగ్రత్తలు

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు నేడు సర్వసాధారణం మరియు వీటిని బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ అని కూడా అంటారు. గర్భధారణ సమయంలో బాక్టీరియా మూత్రనాళంలోకి ప్రవేశించినప్పుడు, ఇది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కు కారణమవుతుంది. మహిళ తన ప్రెగ్నెన్సీలో 6 నుంచి 24 వారాల మధ్యలో ఉన్నప్పుడు యూటీఐ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో మీ డాక్టర్ మీకు యూరిన్ టెస్టు సూచించినప్పుడు వచ్చే ఫలితంలో యూటీఐని గుర్తించవచ్చు. ఒకవేళ ఫలితం పాజిటివ్ గా వస్తే దానికి వెంటనే చికిత్స అందించాల్సి ఉంటుంది. అందుకు డాక్టర్ మీకు మందులు ఇవ్వవచ్చు. అధ్యయనం ప్రకారం ప్రెగ్నెన్సీ సమయంలో దాదాపు 31 శాతం మంది మహిళలు లక్షణాలతో కూడిన లేదా లక్షణాలు లేని యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ బారినపడ్డారు.

ఉపశమనం కోసం మీరు ఇంట్లో కూడా కొన్ని టిప్స్ ని పాటించవచ్చు. యూటీఐ (యురినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్) లక్షణాలు ఇవే:

  • పొత్తి కడుపులో నొప్పి తిమ్మిరి
  • జ్వరం మరియు వణుకు
  • మూత్రం లో మ్యూకస్ లేదా రక్తం
  • మూత్రానికి వెళ్ళినప్పుడు మంటగాగానీ, నొప్పిగాగానీ ఉండటం
  • మూత్రం చెడు వాసన రావడం
  • తరచుగా మూత్రానికి వెళ్లాల్సి రావడం
  • సెక్స్ చేస్తున్నప్పుడు నొప్పి
  • బాక్టీరియా కిడ్నీలకు చేరినప్పుడు, వెనుకవైపు నొప్పి, నలతగా ఉండటం, వాంతులు రావడం
  • మీరు మూత్రం ఎక్కువగా గానీ, తక్కువగా గానీ పోయడం

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కు చికిత్స ఇవ్వకపోతే పుట్టే బిడ్డ తక్కువ బరువుతో గానీ, నెలలు నిండక ముందే పుట్టడంగానీ జరుగుతుంది. ఒకవేళ వైద్యులు ఈ ఇన్ఫెక్షన్ కు చికిత్స త్వరగా ఇస్తే బిడ్డకు హాని జరగదు. యూరిన్ కల్చర్ రిపోర్ట్ వచ్చాక మీ డాక్టర్ 3-7 రోజులకు సరిపడా మందులు ఇవ్వవచ్చు. కేవలం మందులు మాత్రమే కాకుండా యూటీఐని తగ్గించేందుకు పలు మార్గాలు ఉన్నాయి.

  • బాక్టీరియా మొత్తాన్ని మీ శరీరంలోంచి బయటకు తరిమేసేందుకు మీరు చాలా నీటిని తాగాల్సి ఉంటుంది. దాంతో పాటు ఇతర ద్రవాలైన కొబ్బరినీళ్లు, మజ్జిగ, తాజా పండ్లరసాలు, ప్లేవర్డ్ పాలు, నిమ్మకాయ నీరు తాగాలి.
  • మీరు ఒకవేళ మూత్రాన్ని ఎక్కువసేపు ఆపి ఉంచితే బాక్టీరియా మరింతగా వృద్ధి చెందుతుంది. అనంతరం అది కిడ్నీలకు హాని కలిగిస్తుంది.
  • ప్రోబయాటిక్స్ ను తీసుకోవడం ద్వారా మీ శరీరంలోని మంచి బాక్టీరియాను వృద్ధి చెందించవచ్చు. ఉదాహరణకు పెరుగు, పచ్చి చీజ్ వంటివి.
  • తీపి తీయకుండా తయారు చేసిన క్రాన్ బెర్రీ జ్యూస్ తాగడం ద్వారా బాక్టీరియాను శరీరంలోకి వెళ్లకుండా నియంత్రించవచ్చు. అంతేగాకుండా ఇది బాక్టీరియాతో పోరాడటానికి రక్షణగా పని చేస్తుంది.
  • విటమిన్ సి తీసుకోవడాన్ని పెంచాలి. తాజా కూరగాయలు, కివి పండ్లు, బెల్ పెప్పర్స్, ఆరెంజ్, నిమ్మ పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో డైట్ మార్చాలనుకున్న ప్రతిసారి మీ వైద్యుడిని కలవండి.
  • మీ డైట్ నుంచి చక్కెర, రిఫైన్డ్ ఆహారాలు, క్యాన్డ్ జ్యూస్, ఆల్కహాల్, కెఫిన్ వంటి వాటిని తొలగించండి.
  • విటమిన్ సి, జింక్, బీటా కెరోటిన్ సప్లిమెంట్లను మీ వైద్యుడి సలహా మేరకు తీసుకోండి.
  • ఒకవేళ మీరు యూటీఐ చికిత్స తీసుకుంటున్నట్లయితే మీ భాగస్వామితో శారీరక సంబంధం నుంచి దూరంగా ఉండండి.
  • మూత్రానికి వెళ్లినప్పుడల్లా పూర్తిగా బ్లాడర్ ను ఖాళీ చేయండి.
  • ప్రతి రోజు స్నానం చేస్తూ లోదుస్తులు మార్చండి.
  • మీ వాష్ రూమ్స్ ను శుభ్రంగా ఉంచుకోండి.
  • బిగుతుగా ఉండే బట్టలను ధరించవద్దు. వదులుగా ఉండే వస్త్రాలను ధరించండి.
  • ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోండి, సమతుల ఆహారం తిని వ్యాయామం చేయండి.
  • సౌందర్యలేపనాలైన పౌడర్, డియోడరండ్, సబ్బులు, యాంటీసెప్టిక్ క్రీమ్ లను దూరం పెట్టండి.
  • ఎల్లప్పుడూ కాటన్ మెటర్నటీ లోదుస్తులు ధరించండి. అది మీ శరీరాన్ని హాయిగా ఉంచుతూ మంచి అనుభవాన్ని ఇస్తుంది.

మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో UTIలను ఎలా ఎదుర్కోవాలి: నివారణ, చికిత్సలు

ప్రెగ్నెంట్ మహిళల్లో యూటీఐ ఎందుకు వస్తుంది ?

ప్రెగ్నెన్సీ సమయంలో యూరినరీ ట్రాక్ట్ అనాటమీలో మార్పులు ఉంటాయి. యుటెరస్ సాగినప్పుడు బ్లాడర్ తో పాటు యూట్రస్ (గర్భకోశం) కూడా ఒత్తిడికి గురవుతుంది. అది మూత్రపిండాలు పెద్దగా మారడానికి దోహదపడుతుంది. ప్రెగ్నెన్సీ వల్ల బ్లాడర్ కుదించబడుతుంది. ఆ సమయంలో దాన్ని ఖాళీ చేయడం కష్టంగా ఉంటుంది. మీరు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఎక్కువగా తీసుకునే ప్రొటీన్ వల్ల, హార్మోన్ల వల్ల, చక్కెర వల్ల యూరిన్ లోని ఎసిడిటీ తగ్గుతుంది. చక్కెర ఎక్కువగా ఉండేచోటు బాక్టీరియాకు స్వర్గం లాంటిది. దీనివల్ల ప్రెగ్నెంట్ మహిళలు ఎక్కువగా యూరినరీ ట్రాక్ట్ ఇన్పెక్షన్ (యూటీఐ) బారిన పడతారు. 12 నుంచి 16 వారాల ప్రెగ్నెన్సీ సమయంలో యూరినాలసిస్, కల్చర్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచన.

ప్రెగ్నెన్సీ సమయంలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రావడానికి కారణాలేంటి ?

ప్రెగ్నెన్సీలో ఉండగా, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రావడానికి కొన్ని సాధారణ కారణాలేవనగా:

  • బోవెల్ బాక్టీరియా

బోవెల్ లోని బాక్టీరియా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. స్త్రీలలోని యురెత్రా-రెక్టమ్ పొడవు చాలా తక్కువగా ఉంటుంది. దీంతో ఈ.కొలి వంటి బాక్టీరియా సులువుగా యూరినరీ ట్రాక్ట్ లోకి ప్రవేశిస్తుంది.

  • శరీరంలో మార్పులు

పెరుగుతున్న యుటెరస్, యుటెరస్ లో నెమ్మదిగా జరిగే మూత్ర ప్రవాహం, పెరిగే హార్మోన్ స్థాయిల వల్ల బ్లాడర్ మీద ఒత్తిడి పెరుగుతుంది. దీని వల్ల బ్లాడర్ లోని మూత్రం పూర్తిగా బయటకు రాదు. ఈ విధంగా ప్రెగ్నెన్సీ సమయంలో శరీరంలో జరిగే మార్పులు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కు కారణమవుతాయి.

  • ప్రెగ్నెన్సీ మరియు లైంగిక చర్యలు

ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు సెక్స్ లో పాల్గొనడం మంచిదే. అయితే అది యూటీఐ సంక్రమించే అవకాశాలను పెంచుతుంది. యురెత్రా ద్వారా వెజైనల్ క్రిములు యూరినరీ ట్రాక్ట్ లోకి ప్రవేశిస్తాయి. సెక్స్ లో పాల్గొనే ముందు, పాల్గొన్న తర్వాత మూత్ర విసర్జన చేయడం ద్వారా ఆ ప్రాంతం కడగబడుతుంది. తద్వారా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు.

  • గ్రూప్ బి ట్రెప్టోకోకల్ బాక్టీరియా

ప్రెగ్నెన్సీ సమయంలో మూత్రానికి వెళ్ళినప్పుడు నొప్పిని కలిగించే బాక్టీరియా సాధారణంగా డైజెస్టివ్ ట్రాక్ట్ లో ఉంటుంది.

యూటీఐ సంక్రమించిన శరీర భాగాలకు వచ్చే లక్షణాలు

కిడ్నీలు

ఒకవేళ మీ కిడ్నీలు దీని బారినపడితే వచ్చే పరిస్థితిని ఎక్యూట్ పైలోనీఫ్రిటిస్ అంటారు. దీనిలో సహజంగా కనిపించే లక్షణాలేవనగా:

  • వెనుకవైపు నొప్పి
  • అధిక జ్వరం, చలి
  • మగతగా ఉండటం
  • తరచుగా వాంతులవడం

బ్లాడర్

ఒక వేళ మీ బ్లాడర్ దీని బారినపడితే వచ్చే పరిస్థితిని సిస్టిటిస్ అంటారు. దీనిలో సహజంగా కనిపించే లక్షణాలేవనగా:

  • పెల్విక్ నొప్పి
  • యూరిన్ లో రక్తం కనిపించడం
  • యూరినేషన్ చేసేటప్పుడు నొప్పి
  • పొత్తికడుపు దిగువ భాగంలో నొప్పి

యురెత్రా

ఒక వేళ మీ యురెత్రా దీని బారినపడితే వచ్చే పరిస్థితిని యురెత్రెటిస్ అంటారు. ఇందులో పలు లక్షణాలు కనిపించవచ్చు. వాటిలో మూత్రానికి వెళ్ళినప్పుడు మంటగా ఉండటం, అసాధారణ డిశ్చార్జ్ ఉండటం వంటివి ఉండొచ్చు.

ప్రెగ్నెన్సీలో యూటీఐ వ్యాధి నిర్ధారణ ఎలా ?

యూటీఐని గుర్తించడానికి యూరిన్ కల్చర్ పరీక్ష నిర్వహిస్తారు. యూరిన్ లో బాక్టీరియా కనిపిస్తే ప్రెగ్నెన్సీలో సురక్షితమైన యాంటీబయాటిక్స్ ఇస్తారు. ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉంటూ, బాక్టీరియా లొంగకపోతే తప్ప యాంటీ బయాటిక్స్ ను 10 రోజులకు మించి ఇవ్వరు.

ప్రెగ్నెన్సీలో ఉండగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్: అది ప్రమాదమా ?

యూరినరీ ఇన్ఫెక్షన్స్ సోకినప్పుడు చికిత్స తీసుకోకపోతే వచ్చే ప్రమాదాల పట్ల అవగాహన కలిగిఉండాలి. కిడ్నీ ఇన్ఫెక్షన్ల విషయంలో ఇది తల్లీ, బిడ్డలకు తీవ్రమైన ప్రమాదంగా మారవచ్చు. అది ముమ్మాటికీ నిజం. సైడ్ ఎఫెక్ట్స్ లో భాగంగా బిడ్డ తక్కువ బరువుతో, నెలలు నిండకముందే పుట్టవచ్చు. ఒక వేళ ఈ వ్యాధికి సరైన చికిత్స ఇవ్వకపోతే డెలివరీ తర్వాత కూడా తిరగబెట్టవచ్చు.

యుటిఐలు ఉన్న మహిళలకు నిర్ధిష్టంగా ఉండే సాధారణ ప్రమాద కారకాలు

మహిళలల్లో అన్ని వయసుల వారిలో యూటీఐ తరచుగా వచ్చే అవకాశం ఉన్నందున, ఈ పరిస్థితికి పలు ప్రమాద కారణాలు ఉన్నాయి. కాబట్టి యూటీఐలకు మహిళలు బాధితులుగా మారే అవకాశం ఉంది. కొన్ని ప్రమాద కారణాలు కింద ఉన్నాయి.

మహిళల శరీర నిర్మాణం

మగవారి శరీర నిర్మాణంతో పోలిస్తే మహిళల శరీరంలో తక్కువ యురెత్రా ఉంటుంది. దీనివల్ల బాక్టీరియా తక్కువ దూరం మాత్రమే ప్రయాణించి ట్రాక్ట్ లో ఇన్ఫెక్షన్ కలిగించగలుగుతుంది. అంతేగాక ప్రెగ్నెన్సీ సమయంలో యూరిన్ ఇన్ఫెక్షన్ ప్రమాదం మరింతగా పెరుగుతుంది.

లైంగిక చర్య

లైంగికంగా యాక్టివ్ గా లేని మహిళలతో పోలిస్తే లైంగికంగా యాక్టివ్ గా ఉన్న మహిళలు యూటీఐ బారిన పడే అవకాశాలు మరింత ఎక్కువ. అంతేగాక ఒకరికంటే ఎక్కువ మందితో లైంగిక క్రియలను పెట్టుకోవడం కూడా యూటీఐ రిస్క్ ను పెంచుతుంది.

గర్భ నియంత్రణ

డయాఫ్రమ్స్ వంటి గర్భ నియంత్రణ పద్ధతులను అవళంబించే మహిళలల్లో యూటీఐ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఒక వేళ మీరు స్పెర్మిసైడల్ ఏజెంట్స్ ఉపయోగిస్తుంటే కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

మెనోపాజ్

మెనోపాజ్ సమయంలో ఈస్ట్రోజన్ స్థాయిల్లో తగ్గుదల ఉంటుంది. దీని వల్ల మహిళల శరీరంలో చాలా మార్పులు ఉంటాయి. ఇది కూడా యూటీఐకి దారి తీయవచ్చు.

అసహజ కారణాలు

శిశువులో ఉండే అసహజ యూరినేషన్ వంటి కారణాల వల్ల యురెత్రా యూటీఐ బారిన పడుతుంది.

అడ్డుగోడలు

యూరినరీ ట్రాక్ట్ లో ఉండే పలు అడ్డుగోడల (బ్లాకేజెస్) వల్ల కూడా బ్లాడర్ వద్ద యూరిన్ ట్రాప్ అయిపోయి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. దానికి సాధారణ ఉదాహరణలు కిడ్నీలలో రాళ్లు ఏర్పడటం, ప్రొస్టేట్ వాపు.

బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ

డయాబెటిస్ వంటి పలు వ్యాధులు రోగనిరోధక వ్యవస్థను బలహీనపరచవచ్చు. దాని వల్ల క్రిములకు వ్యతిరేకంగా శరీరం పోరాడలేకపోతుంది. దీనివల్ల కూడా యూటీఐ ఏర్పడవచ్చు.

కాథెటెర్

తమకై తాము మూత్ర విసర్జన చేయలేని వారికి విసర్జన కోసం శరీరంలో వేసే పైపును కాథెటెర్ అంటారు. దీని నిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తుంది.

ఇటీవల జరిగిన ఆపరేషన్

ఇటీవలే మీరు యూరినరీ సర్జరీ చేయించుకొని ఉంటే, యూటీఐ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే సర్జరీ సమయంలో ఉపయోగించిన మెడికల్ పరికరాల వల్ల ట్రాక్ట్ లో ఏర్పడిన పరిస్థితి కారణం.

యూటీఐతో చిక్కులు

యూటీఐని త్వరగా గుర్తించి సరైన చికిత్స ఇస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. అయితే చికిత్స చేయించుకోకపోతే మాత్రం ఊహించలేని పరిణామాలకు అది దారి తీయవచ్చు. యూటీఐతో వచ్చే పలు సమస్యలు కింది ఇవ్వబడ్డాయి.

  • యూరినరీ ట్రాక్ట్ లో పదేపదే ఇన్ఫెక్షన్లు రావచ్చు. 6 నెలల వ్యవధిలో మూడుసార్ల కంటే ఎక్కువగా యూటీఐతో బాధపడిన మహిళల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.
  • ఫిలోనెఫ్రైటిస్ కారణంగా కిడ్నీ దెబ్బతినవచ్చు.
  • ప్రెగ్నెన్సీ సమయంలో మహిళ యూటీఐ బారినపడే అవకాశాలు మరింత పెరుగుతాయి. అంతేగాక అది నెలలు నిండక ముందే బిడ్డలు జన్మించేలా కూడా చేయవచ్చు.
  • ఒక వేళ ఇన్ఫెక్షన్ బ్లాడర్ నుంచి కిడ్నీల వరకూ వెళ్లితే, సెప్సిస్ వంటి ప్రాణాంతక పరిస్థితి ఎదురుకావచ్చు. అదే యూరినరీ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే అత్యంత తీవ్రమైన చిక్కు.

ప్రెగ్నెన్సీలో వచ్చే బ్లాడర్ ఇన్ఫెక్షన్ కు చికిత్స

ప్రెగ్నెంట్ గా ఉండగా బ్లాడర్ ఇన్ఫెక్షన్ సోకితే యాంటిబయాటిక్స్ ఇస్తారు. కొద్ది రోజులకు నొప్పి తగ్గినప్పటికీ, ప్రిస్కిప్షన్ పూర్తయ్యేవరకూ వాటిని వాడాల్సి ఉంటుంది.

యూటీఐ నుంచి కోలుకోవడానికి తినాల్సిన ఆహార పదార్థాలు

యూరినరీ ఇన్ఫెక్షన్ ను చికిత్స అందించడం ఎంత అవసరమో, దాని నుంచి వేగంగా కోలుకోవడానికి కూడా బలమైన ఆహార పదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి పదార్థాలు కింద ఇవ్వడమైంది.

బెర్రీస్

క్రాన్ బెర్రీస్, రాస్ప్ బెర్రీస్, బ్లూ బెర్రీస్ వంటివి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ నుంచి వేగంగా కోలుకోవడానికి తోడ్పడతాయి. అంతేగాక వీటిలో ఉండే ప్రొయాయంథోసైనిడిన్ వల్ల యూరినరీ ట్రాక్ట్ లైనింగ్ వెంట పెరిగే ఇన్ఫెక్షన్ కలిగించే క్రిముల వృద్ధి నియంత్రించబడుతుంది. ప్రెగ్నెన్సీ మొదటి రోజుల్లో యూటీఐని నివారించడానికి బెర్రీస్ తీసుకోవడం మంచిది.

పీచు ఉండే పదార్థాలు

యూరినరీ ట్రాక్ట్ లో ఉండే హానికారక బాక్టీరియాను పారద్రోలేందుకు పీచు అధికంగా ఉండే పదార్థాలైన అరటి, పప్పులు, ఓట్స్ వంటివి ఉపయోగపడతాయి. దాంతో పాటు పేగు కదలికలకు, బ్లాడర్ మీద ఒత్తిడిని తగ్గించడానికి కూడా అవి ఉపయోగపడతాయి.

సాల్మన్

యూటీఐ వల్ల కలిగే మంటను ఆపడంలో చల్లని నీటిలో నివసించే చేపలోని ఓమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉపయోగపడతాయి. ఒకవేళ మీరు శాకాహారి అయితే, చేప ఆయిల్ సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. అయినప్పటికీ మీ డైట్ లో మార్పు చేయాలనుకున్న ప్రతిసారి మీ వైద్యున్ని కలవాలి.

యూటీఐ మరియు లైంగిక చర్యలు

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సెక్స్ కారణంగా వ్యాప్తి చెందదనే విషయం ముందుగా తెలుసుకోవాలి. సూటిగా చెప్పాలంటే అది మహమ్మారి కాదు. అయినప్పటికీ, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తితో సెక్స్ లో పాల్గొనడం వల్ల కొన్ని సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకు, ఒక మహిళ యూటీఐతో బాధపడుతుంటే, సెక్స్ చేసే సమయంలో నొప్పి, యురెత్రా వద్ద చికాకు కలిగే అవకాశం ఉంటుంది. నిజానికి వెజీనా లోపలి గోడల మీద సెక్స్ కారణంగా కలిగే ఒత్తిడి వల్ల సున్నితమైన బ్లాడర్ మీద మరింత ఒత్తిడి పడి నొప్పి ఎక్కువ అవుతుంది.

యూటీఐ పెరిగే అవకాశాలను సెక్స్ కల్పిస్తుంది. అంతేగాక సున్నితమైన యురెత్రా ప్రాంతంలోకి ప్రమాదకరమైన బాక్టీరియా వెళ్లేందుకు అవకాశం కల్పిస్తుంది. కండోమ్ ఉపయోగించినా, ఉపయోగించకపోయినా, సెక్స్ వల్ల హానికరమైన బాక్టీరియా యురెత్రా లోపలికి వెళ్తుంది. అందువల్ల యూటీఐ లక్షణాలు కనిపించగానే అన్ని రకాల సెక్సువల్ చర్యల నుంచి దూరంగా ఉండాలి.

ముగింపు

అన్ని రకాల యూటీఐ కేసుల్లో మెడికల్ సహాయం తీసుకోవాల్సిన అవసరంలేనప్పటికీ, వైద్యున్ని కలవడం వల్ల భవిష్యత్తులో యూటీఐ మళ్లీ రాకుండా చూసుకోవచ్చు. ఒకవేళ మీకు బ్లాడర్ ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపిస్తే, వెంటనే వెళ్లి పరీక్ష చేయించుకోవాలి. తద్వారా ఫిలోనెఫ్రైటిస్ లేదా సెప్టిసేమియా రాకుండా కాపాడుకోవచ్చు. అంతేగాక మీరు ప్రెగ్నెంట్ అయ్యుండి యూటీఐ సమస్యలు రాకుండా ఉండాలన్నా చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.